దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్త ఉమ్మడి మండల ఎస్సై రమేష్ కుమార్

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మరియు చౌడాపూర్ మండలాల ప్రజలకు ఎస్సై రమేష్ కుమార్ ఉమ్మడి మండలాల ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు ఇటీవల వరుసగా గొర్రెలు/మేకల దొంగతనాలు జరుగుతున్నాయి.

👉🏻 మన  ప్రాంతంలో చాలా మంది గొర్రెలు/మేకల మందలు పెంచుతున్నారు. ఒక్కొక్క మందలో 100 నుండి 500 జీవాలు ఉంటాయి.
👉🏻 ఉదాహరణకు ఒక మందలో 200 మేకలు ఉంటే, ఒక్క మేకను రూ.10,000 విలువగా ఉంటే మొత్తము వాటి విలువ  రూ.20,00,000 (ఇరవై లక్షలు) రూపాయల ఆస్తి అవుతుంది.
👉🏻 ఇంత విలువైన ఆస్తిని నిర్లక్ష్యంగా వదిలేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం.

రోజంతా కష్టపడి మంద వెంట తిరిగే కాపలాదారులు అలసిపోవడం సహజం. అందుకే మంద దగ్గర కాపలా విధానం సక్రమంగా ఉండాలి.
🚨 దొంగతనాలను నివారించడానికి కుల్కచర్ల పోలీసుల సూచనలు

1. రాత్రివేళలో తప్పనిసరిగా ఇద్దరిని మంద దగ్గర కాపలా పెట్టాలి.


2. ఒకరు విశ్రాంతి తీసుకుంటే, మరొకరు జాగ్రత్తగా గమనించాలి.


3. ముఖ్యంగా రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటలవరకు అప్రమత్తంగా ఉండాలి.


4. టార్చిలైట్ సహాయంతో చుట్టుపక్కల గమనించాలి.


5. తెలియని వ్యక్తులు, వాహనాలు వస్తే వారితో మాట్లాడి, అవసరమైతే ఫోటోలు తీయాలి.


6. స్థిరమైన మందలు ఉంటే సరైన లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి.


7. తక్కువ ఖర్చుతో లభించే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క కెమెరా 360 డిగ్రీలు తిరుగుతూ అన్నీ రికార్డు చేస్తుంది.


8. రెండు లేదా అంతకన్న ఎక్కువ గొర్రెల మందలుంటే  యజమానులు అందరూ కలిసి వంతుల వారీగా కాపలాదారుడిని ఏర్పాటు చేసుకోవాలి.

📞 అత్యవసర సమయాల్లో

ఏదైనా దొంగతనం గమనిస్తే వెంటనే 100 నెంబర్ కి ఫోన్ చేయండి.

పోలీసులు తక్షణమే వస్తారు, దొంగలను పట్టుకొని కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తారు.

మన ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలు తిరుగుతున్నట్లు మనకు అనుమానం వస్తే వెంటనే గ్రామ పెద్దలు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి

సంప్రదించాల్సిన నంబర్లు:

కుల్కచర్ల పోలీస్ స్టేషన్: ☎️ 8712670044

విచారాబాద్ పోలీస్ కంట్రోల్ రూం: ☎️ 8712670056