గండీడ్ లో ఏకరూప దుస్తుల పంపిణీ ప్రారంభం MEO, సర్పంచ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరు

BB6 TELUGU NEWS CHANNEL
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను నేడు అధికారికంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. గండీడ్ మండల కేంద్రంలోని MPPS ప్రధాన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఏకరూప దుస్తులతో విద్యార్థులు అధికారులు

ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి MEO జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు స్వయంగా యూనిఫాం దుస్తులను పంపిణీ చేశారు. విద్యార్థులందరూ ఏకరూప దుస్తులు ధరించడం వల్ల పాఠశాలలో సమానత్వం, క్రమశిక్షణ పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గండీడ్ గ్రామ సర్పంచ్ భగవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను గ్రామ పంచాయతీ తరఫున కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అనంత లక్ష్మి రెడ్డి ,APM రజిత CC లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ ఎంతో ఉపయోగకరమని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

రాఖీ పండుగ జరుపుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు కొత్త దుస్తులు రావడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఏకరూప దుస్తుల పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

Related News