ప్రభాస్ వచ్చాక వేరే లెవెల్ మా అన్న అదరగొట్టాడు మంచు విష్ణు

Manchu Manoj : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్పప్ప నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మంచు మనోజ్ ప్రసాద్ ఐ మాక్స్ లో సినిమా చూసి మీడియాతో మాట్లాడారు. సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. నేను ఊహించిన దానికంటే వెయ్యి రేట్లు బాగుంది. ప్రత్యేకించి ప్రభాస్ వచ్చిన తర్వాత వేరే లెవల్ లో ఉంది. ఇంత అద్భుతంగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చివరి 20 నిముషాలు అదిరిపోయింది. మా అన్న అద్భుతంగా చేశాడు. ఇది మానాన్న, వాళ్ల టీమ్ ఏళ్ల కృషి. మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంది.
వాళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. పెట్టిన ప్రతిరూపాయికి వెయ్యి రేట్లు రావాలి అని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చారు మంచు మనోజ్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయిన కన్నప్ప.. మంచి పాజిటివ్టాక్స్ తో దూసుకు పోతోంది.సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ సీట్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. రుద్ర పాత్రలో ఆయన అదరగొట్టాడు అంటున్నారు ప్రేక్షకులు. ఎన్నో ట్రోల్స్ తో మొదలైన కన్నప్ప జర్నీ.. రిలీజ్ టైమ్ వరకు మంచి రెస్పాన్స్దక్కించుకుంది. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్ లాంటి వారు నటించడం కలిసొచ్చింది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe