బాలయ్య అభిమానులకు షాక్..అఖండ 2 రిలీజ్ చేయకూడదని. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు

BB6 TELUGU NEWS CHANNEL
Eros International Media Ltd co చెల్లించాల్సిన సుమారు 28 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డ్ (మధ్య వర్తిత్వ పరిహారం) చెల్లించేంత వరకూ అఖండ 2 సినిమాను విడుదల చేయకూడదని మద్రాస్ హైకోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ2 సినిమా విడుదలకు అనుకోని ఆటంకం ఎదురైంది. జస్టిస్ ఎస్ఎంసుబ్రమణ్యం, జస్టిస్ సి.కుమరప్పన్ తో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. అక్టోబర్ 30, 2025న Eros InternationalMedia Ltd దాఖలు చేసిన పిటిషన్లను అప్పట్లో సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ Eros సంస్థ అప్పీల్ కు వెళ్లింది.తాజాగా.. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ లు వరించిన తీర్పు Eros సంస్థకు అనుకూలంగా రావడంతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. పూర్తి ఆర్బిట్రల్ అవార్డు మొత్తం 27 కోట్ల 80 లక్షల 18 వేల 13 రూపాయలు.. 14 శాతం వడ్డీ ఈరోజు చెల్లిస్తేనే సినిమాను విడుదల చేయాలని  అఖండ 2 విడుదలకు ముందు మద్రాస్‌ సివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe