BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నశా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మాదకద్రవ్య రహిత సమాజం కోసం తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో అడుగు ముందుకేసింది.
అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, గౌరవ రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ నేతృత్వంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ అవేర్ నెస్ విభాగం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు తన బృందంతో పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన, సురక్షిత సమాజాన్ని నిర్మించడమే ఈ ర్యాలీ లక్ష్యం.
యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ఈ ర్యాలీ ద్వారా చాటిచెప్పారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ ఆరోగ్యంతో పాటు కుటుంబాలను, సమాజాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అంతేకాకుండా మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ ఫోర్స్ పాత్రను కూడా ఈ సందర్భంగా వివరించారు. చట్ట అమలు, నిఘా, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిస్తే ప్రజలు భయపడకుండా ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1908 కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారం, సకాలంలో ఇచ్చే సమాచారమే డ్రగ్స్ నియంత్రణకు కీలకమని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నివారణ అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని ఈగల్ ఫోర్స్ స్పష్టం చేసింది.
చివరగా “మాదకద్రవ్యాలకు నో చెప్పండి – జీవితాన్ని ఎంచుకోండి (Say No to Drugs – Choose Life)” అనే బలమైన సందేశంతో కార్యక్రమం ముగిసింది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్య సాధనకు ఈగల్ ఫోర్స్ కట్టుబడి ఉందని తెలిపింది.
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ జిల్లాలో విజయ తెలంగాణ డైరీ (TGDDCFL) ఫ్రాంచైజీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత నాలుగు నెలలుగా ఉత్పత్తుల సరఫరా పూ...
BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్, అక్టోబర్ 29:ఎల్-నినో ప్రభావంతో రాబోయే కరువు ముప్పు, బహిరంగ మార్కెట్లో నిత్యవసర ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్...
BB6 TELUGU NEWS CHANNEL ప్రజలను పట్టి పీడించుకుంటున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడి చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. అధిక వడ్డీ వసూళ్లు చేస్తున్న వారి...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ సంస్కృతీ వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగలో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జ...
BB6 TELUGU NEWS CHANNEL భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్ (CORE) పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించార...
గండీడ్, మహబూబ్ నగర్ జిల్లాBB6 TELUGU NEWS CHANNEL దసరా సెలవులు వచ్చేశాయి.. దీంతో మండల కేంద్రమైన గండీడ్ లోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. చదువుల కోసం గండీడ్ కు వచ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది....
BB6 TELUGU NEWS CHANNEL ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్...