మహిళను హత్య చేసి మృతదేహాన్ని కాల్చిన ప్రియుడు
వెన్నచెడ్ చెరువు కట్ట వద్ద హత్య – ఆర్థిక వివాదమే కారణమా?
BB6 TELUGU NEWS CHANNEL
కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం అమృతమ్మ (34) అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గత నెల 18.09.2026న అమృతమ్మ అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా, అదే గ్రామానికి చెందిన మంగలి ఆనంద్ (28) పై అనుమానం వచ్చింది.
నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, మృతురాలితో గతంలో సన్నిహిత సంబంధం ఉన్నట్లు, వారి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం నడుస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
18.09.2026న అమృతమ్మను మోటార్ సైకిల్ పై తీసుకెళ్లిన అనంతరం వెన్నచెడ్ చెరువు కట్ట సమీపంలో ఆమె మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని కాల్చి, అవశేషాలను వేరే ప్రాంతానికి తరలించి దాచినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ప్రస్తుతం మృతదేహ అవశేషాల గుర్తింపు, స్వాధీనం, ఫోరెన్సిక్ పరీక్షల ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని కుల్కచర్ల పోలీసులు పేర్కొన్నారు.
Related News
ఆటపాటలతో మార్మోగిన
రవీంద్రభారతి వేదికపై ఎంగిలిపూల సందడి
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును