BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్, సెప్టెంబర్ 11:
గండీడ్ మండల కేంద్రంలో శుక్రవారం SGF మండల స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీఎం శ్రీ ఉన్నత పాఠశాల (బాలుర), గండీడ్‌లో ఏర్పాటు చేసిన అండర్-14, అండర్-17 బాలుర ఖో-ఖో, కబడ్డీ పోటీలను MEO ఆర్. జనార్ధన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల వల్ల విద్యార్థులలో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని, చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ముఖ్య అతిథిగా హాజరైన గండీడ్ గ్రామ సర్పంచ్( గండీడ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు) ఆర్. భగవంత్ రెడ్డి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుముడాల చెన్నయ్య, స్థానిక పీఈటీ ఎం. రాములు, వివిధ పాఠశాలల పీఈటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు:
కబడ్డీ (అండర్-17):
ప్రథమ బహుమతి: TGMS మోడల్ స్కూల్
ద్వితీయ బహుమతి: ZPHS (B) వెన్నచేడ్
కబడ్డీ (అండర్-14):
ప్రథమ బహుమతి: పీఎం శ్రీ ZPHS (B) గండీడ్
ద్వితీయ బహుమతి: TGMS మోడల్ స్కూల్
ఖో-ఖో (అండర్-17):
ప్రథమ బహుమతి: ZPHS (B) వెన్నచేడ్
ద్వితీయ బహుమతి: ZPHS కొమిరెడ్డిపల్లి
ఖో-ఖో (అండర్-14):
ప్రథమ బహుమతి: ZPHS (B) వెన్నచేడ్
ద్వితీయ బహుమతి: ZPHS కొమిరెడ్డిపల్లి
