BB6 TELUGU NEWS CHANNEL
డీఎస్సీ నియామకాల్లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. బాబు స్కామ్ హిస్టరీలో డీఎస్సీ ఒక ఆణిముత్యం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పరీక్షే లేకుండా 372 స్పోర్ట్స్ కోటా పోస్టులు ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు.తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకే జీవో నంబర్ 4, 47 తో గేట్లు తెరిచారని, పని అయిపోయాక జీవో నంబర్ 23, 25, 56 తో గేట్లు మూశారని ఆరోపించారు.
డీఎస్సీ స్కామ్‌ను ప్రభుత్వమే దగ్గరుండి నిర్వీర్యం చేస్తోందని, కొడుకును కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని జగన్ మండిపడ్డారు.
డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
DSC లో 372 స్పోర్ట్స్ కోటా స్కామ్.. చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు
10
Sep