BB6 TELUGU NEWS CHANNEL
Andhra Pradesh and Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం తీవ్రమైన ఉక్కపోత, వేడితో అల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం తీవ్రమైన ఉక్కపోత, వేడితో అల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి, దక్షిణ – నైరుతి దిశగ గాలుల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉత్తర అంతర కర్ణాటక నుండి దక్షిణ అంతర కర్ణాటక – తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు, సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీంతోపాటు ఆంధ్ర ప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :-
ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
ఆదివారం, సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ :-
ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
గమనిక:- రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2-4డిగ్రీలు పెరిగే అవకాశముంది. ఆ తదుపరి గణనీయమైన మార్పు లేదు.
తెలంగాణలో వర్షాలు..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పు ఏమి లేదు . ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సిరిసిల్ల, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లో, అలాగే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కొత్తగా వర్షాలు కురుస్తాయి.. హైదరాబాద్‌లో సాయంత్రం – రాత్రి వేళల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వచ్చే 3రోజుల వెదర్ రిపోర్ట్
19
Apr