బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీమతి సత్తెమ్మ పాడె మోసిన కేటీఆర్

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ సత్తెమ్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి.

వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, “జై తెలంగాణ” నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు.

స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe