రేపటి నుండి గండీడ్ మరియు వెన్నచెడ్ గ్రామాలలోని రైతువేదికలలో విత్తన మేళా

BB6 TELUGU NEWS CHANNEL
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 23-06-2026 నుండి 29-06-2026 వరకు గండీడ్ మరియు  వెన్నచేడ్డ్ రైతు వేదికలలో విత్తన మేళా నిర్వహించబడుతుంది.

ఈ విత్తన మేళాలో రైతులకు నాణ్యమైన ధృవీకరించబడిన వరి, పప్పు ధాన్యాలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే నానో యూరియా మరియు నానో డి.ఎ.పి. కూడా విక్రయించబడతాయి.

వరి రైతుల కోసం ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 8 రకాలకు సంబంధించిన వరి విత్తనాలు కూడా ఈ మేళాలో అందుబాటులో ఉంచబడతాయి.

రైతులు తమకు అవసరమైన విత్తనాలను, వ్యవసాయ ఉత్పాదకాలను రైతు వేదికలలోనే కొనుగోలు చేసి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

📍 రైతు వేదికలు: గండీడ్ మరియు వెన్నచేడ్డ్
తేదీలు: 23-06-2026 నుండి 29-06-2026 వరకు….అందరు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

-మండల వ్యవసాయ అధికారి   
        గండీడ్ మండలం

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe