రాముడు బీజేపీ జాగీరా..?’ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ హైదరాబాద్ (గాంధీభవన్)
* శ్రీరామచంద్రుడు ఏమన్నా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాగీరా అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు భగవాన్ శ్రీరాముడికి మీ పార్టీలో ఏమైనా ప్రాథమిక సభ్యత్వం ఉందా, ఉంటే చూపించాలని ఆయన బీజేపీ నాయకులకు ఘాటుగా సవాల్ విసిరారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నాయకులు ప్రతి చిన్న విషయానికి దేవుడి పేరును వాడుకుంటూ విభజన రాజకీయాలకు, ప్రజల దృష్టిని మళ్లించే కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేవుడు అందరివాడని, భక్తిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమ పన్నెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నిరంతరం మతం, దేవుడి పేరిట రాజకీయం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe