గండీడ్ మినీ గురుకులంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం – పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విద్యార్థినుల ప్రతిజ్ఞ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ప్రాథమిక స్థాయి విద్యా సముదాయం, మినీ గురుకులం పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చాటిచెప్పారు.

గండీడ్ మండల కేంద్రంలో ఉన్న మినీ గురుకుల పాఠశాల, అదే గిరిజన సంక్షేమ బాలికల విద్యా సముదాయంలో వన మహోత్సవంలో భాగంగా  హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. TTWREIS ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాలలో పచ్చదనాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, గండీడు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు భగవంతు రెడ్డి, సెక్రెటరీ వెంకట్ రాములు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణం మొత్తం పచ్చని చెట్లతో నిండి ఉన్నప్పటికీ, మరింతగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని సంకల్పించారు. చిన్నారులు స్వయంగా గుంతలు తీసి, మొక్కలు నాటి నీళ్లు పోశారు.

పిల్లలకు స్వీట్స్ తినపెడుతున్న సర్పంచ్
సర్పంచ్ కు రాఖీ కడుతున్న టీచర్