BB6 TELUGU NEWS CHANNEL
నమస్తే, వెల్కమ్ టు BB6 న్యూస్. హైదరాబాద్ లో వైద్యం పేరుతో సాగుతున్న పెద్ద దందా గుట్టురట్టైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ లో వైద్యం పేరుతో సాగుతున్న నకిలీ దందా గుట్టురట్టైంది. సికింద్రాబాద్ జోన్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఆరుగురు నకిలీ వైద్యులు అరెస్ట్ అయ్యారు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 11 మంది వరకు నకిలీ వైద్యులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం.
ఈ నకిలీ డాక్టర్ల వద్ద నుండి నకిలీ MBBS, BHMS సర్టిఫికెట్లతో పాటు వందలాది ఇంజెక్షన్లు, మందులు, సెలైన్లు, వైద్య పరికరాలు బయటపడ్డాయి. వీరిలో ఐదుగురు గతంలో కంపౌండర్లుగా పనిచేసిన వారే. ఎలాంటి వైద్య అర్హత లేకుండానే స్పెషలిస్ట్ డాక్టర్లుగా, చిన్నపిల్లల వైద్యులుగా, చర్మ వ్యాధి నిపుణులుగా చలామణి అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.అంతేకాదు, ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్లు, సెలైన్లతో వైద్యం చేస్తున్నట్లు కూడా గుర్తించారు.
ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) కూడా నగరంలో 20 మంది వరకు నకిలీ డాక్టర్లు ఉన్నట్లు గుర్తించింది. NMC చట్టం సెక్షన్ 34, 54 కింద వీరిపై కేసులు నమోదు చేస్తున్నారు.
చదివింది టెన్త్, ఇంటర్ అయినా ఫేక్ సర్టిఫికెట్లు సంపాదించి ఏళ్ల తరబడి డాక్టర్లుగా చలామణి అవుతున్న వీరి వల్ల ఎంతో మంది అమాయక ప్రజలు నష్టపోతున్నారు. హైదరాబాద్ లో ఆసుపత్రికి వెళ్తే జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నకిలీ డాక్టర్ల వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందా, నకిలీ సర్టిఫికెట్లు ఎక్కడ తయారవుతున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BB6 తెలుగు న్యూస్.
నకిలీ డాక్టర్ల గుట్టురట్టు – నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం – 6 నుండి 11 మంది అరెస్ట్
26
Aug