BB6 TELUGU NEWS CHANNEL
వెన్నచేడ్ రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెన్నచేడ్ గ్రామ సర్పంచ్ శ్రీ గుర్రాల నవనీత చెన్నయ్య , ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో AEO వరలక్ష్మి ,ఉప సర్పంచ్, రవి కాంత్ రెడ్డి,వార్డు నెంబర్లు ,ప్రజా ప్రతినిధులు, విత్తన డీలర్లు, యువకులు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు వరి సన్న రకాల నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు, నానో యూరియా మరియు నానో డీఏపీ ఎరువులను కూడా కొనుగోలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రైతులు తమ పంటల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చని గ్రామ సర్పంచ్ శ్రీ గుర్రాల నవనీత చెన్నయ్య తెలిపారు.
నాణ్యమైన విత్తనాల వినియోగం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. రైతులు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించాలని కోరారు.ఈ విత్తన మేళా కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచి, వ్యవసాయాభివృద్ధికి దోహదపడే ఒక మంచి వేదికగా మారింది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
వెన్నచేడ్ గ్రామం రైతు వేదికలో విత్తనం మేళ హాజరైన గ్రామ సర్పంచ్ ,రైతులు, విత్తన డీలర్లు
23
Jun