July Holidays : తెలుగు స్టూడెంట్స్ కి ఊహించని సెలవులు.. జూలై 2, 10న విద్యాసంస్థలు బంద్

BB6 TELUGU NEWS CHANNEL
అసలు ఒక్క సెలవు కూడా లేని ఈ జూలై నెలలో ఊహించని విధంగా హాలిడేస్ పెరుగుతున్నాయి.ఈ రోజు జూలై 2న, మళ్ళీ జూలై 10న అంటే రెండ్రోజులు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఎందుకో తెలుసా?
జూలైలో ఊహించని సెలవులు
School Holiday : జూలైలో పండగలు, ప్రత్యేక రోజులు ఏమీ ఉండవు… అందుకే తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు కేవలం ఆదివారాలు, రెండో శనివారం తప్ప ఇతర సెలవులేమీ ఉండవు. అంటే విద్యార్థులు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లాల్సిందే. కానీ ఈ జూలైలో తెలంగాణ విద్యార్థులకు ఊహించనివిధంగా సెలవులు వస్తున్నాయి. మరి ఏరోజు, ఎందుకు స్కూళ్లు మూతపడనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఇప్పటికే తెలంగాణలో బిసి సంఘాల బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు రెండ్రోజుల బంద్ కు పిలుపునిచ్చాయి. జూన్ 30, జూలై 2న తెలంగాణలో విద్యాసంస్థల బంద్… అయితే నిన్న (జూన్ 30) తరగతుల బహిష్కరణ, కళాశాలల బంద్, కలెక్టరేట్ ముట్టడి, రాస్తారోకోలు చేపట్టాయి విద్యార్థిసంఘాలు.

ఈ రోజు జూలై 2, గురువారం) తెలంగాణవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ జరగనుంది. ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడమే కాదు ఈ పథకాన్నే పూర్తిగా ఎత్తివేసే కుట్రలు జరుగుతున్నాయని… అందుకే విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నామని బిసి జెఎసి ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ రోజు జూలై 2న చేపట్టే రాష్ట్రవ్యాప్త బంద్ కు ప్రతిఒక్కరు సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

జూలై 10న స్కూళ్లు, కాలేజీల బంద్
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పోరాటానికి సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే ఇవాళ (జూలై 1, బుధవారం) హైదరాబాద్ లో AISF, SFI, PDSU, AIFDS, AIDSO, AIPSU వంటి విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమై కార్యాచరణ రూపొందించాయి. ఈ సందర్భంగా జూలై 10 (శుక్రవారం) తెలంగాణలోని విద్యాసంస్థల బంద్ చేపట్టాలని నిర్ణయించాయి… ఈ మేరకు పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు నాయకులు.

అంటే జూలై 10న విద్యాసంస్థలు మూతపడనున్నాయి… స్కూల్, కాలేజీ విద్యార్థులకు అదనంగా సెలవు వస్తుందన్నమాట. విద్యాసంస్థలు స్వచ్చందంగా సెలవు పాటించకున్నా విద్యార్థి సంఘాల నాయకులు మూసివేయించే అవకాశాలుంటాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా విద్యంసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తమకు సహకరించాలని… బంద్ ను పాటించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఇదిలావుంటే జూలైలో హటాత్తుగా మరికొన్ని సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి… రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ప్రారంభమయ్యాయి… ఇవి తుపానుగా మారితే మాత్రం కుండపోత తప్పదు. ఇలా గత ఏడాది భారీ వర్షాలు, వరదలతో స్కూళ్లకు సడన్ సెలవులు వచ్చాయి… ఈసారి కూడా అలాంటి పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయి. అంటే తెలంగాణ బంద్ లతో పాటు వర్షాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సడన్ హాలిడేస్ వస్తున్నాయన్నమాట.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe