తెలంగాణ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త.ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఆర్థిక శాఖ బుధవారం ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదల చేసింది.

✅ జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు జాప్యం చేయకుండా అందాలని ఇటీవల అధికారులను ఆదేశించారు.

✅ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఇటీవల అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌లో జాప్యం జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొంది.

✅ ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్‌ బిల్లులను ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌, అకౌంట్స్‌ విభాగాలకు సమర్పించాలని ఆదేశించింది. నెల చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

✅ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి గారు బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు జీతాలు జమ చేసినట్లు ఆర్థిక  శాఖ అధికారులు నివేదించారు.