BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం త్వరలో కుటుంబ రిజిస్టర్ సేవను అందుబాటులోకి తీసుకురానుంది. పౌర సేవలను మరింత సులభతరం చేయడం, కుటుంబ వివరాలను ఒకే రికార్డులో భద్రపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కుటుంబ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాలు అధికారిక రికార్డు రూపంలో అందుబాటులో ఉంటాయి. అవసరమైనప్పుడు మీ సేవ కేంద్రాల ద్వారా కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను పొందే అవకాశం కల్పించనున్నారు. అలాగే మీ సేవ ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఈ విధానం అమలులోకి వస్తే వివిధ ప్రభుత్వ పథకాలు, ధ్రువపత్రాలు, ఇతర పౌర సేవలను పొందే ప్రక్రియ మరింత వేగవంతంగా, పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ ఒకే అధికారిక రికార్డులో ఉండటంతో ప్రభుత్వ సేవల అందజేత మరింత సులభం కానుంది.
తెలంగాణలో త్వరలో కుటుంబ రిజిస్టర్.. మీ సేవ ద్వారా సర్టిఫికెట్ జారీ
27
Jul