ఇంత భారాన్ని మోయలేను, హెడ్మాస్టర్ పదవి నుండి తొలగించండి ఓ టీచర్ ఆవేదన

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండలం పగిడియాల గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు టి anjilaiah మండల అధికారి ( meo ) జనార్ధన్ కు ఒక లేఖ ద్వారా వేడుకున్నారు. స్కూల్లో అధ్యాపకుల సమస్య ఉందని ,ఒకే రోజు ఏడు సబ్జెక్టులు మరియు ప్రిన్సిపల్ బాధ్యతలు చేపట్టడం కష్టంగా ఉందని, పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ,లేఖలో పేర్కొన్నారు. మొత్తం 130 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో బోధనతో పాటు ప్రిన్సిపల్ బాధ్యతలను చేపట్టడం కష్టంగా ఉందని తెలిపారు. ఎక్కువ సబ్జెక్టులు ఉదయం నుండి సాయంత్రం వరకు తీరిక లేక అనారోగ్యం పాలు అవుతున్నానని, ఇకనైనా తగు చర్యలు తీసుకొని తనపై ఉన్న అధిక బాధ్యతలను తొలగించి సరిపడా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe