ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి హత్య

BB6 TELUGU NEWS CHANNEL
వాకింగ్ చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఘోరం. వి.కోట మండల కేంద్రంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని.. నడిరోడ్డుపై.. పట్టపగలు కత్తులతో పొడిచి మరీ చంపారు దుండగులు. 2026, ఏప్రిల్ 28వ తేదీ ఉదయం.. జగన్మోహన్ రెడ్డి వాకింగ్ కోసం అని.. ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. రోడ్డుపై వాకింగ్చేస్తూ వెళుతున్న సమయంలో.. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు.

బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వస్తూవస్తూనే.. ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డిపై కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై కత్తులతో.. విచక్షణారహితంగా పొడిచారు. ఊహించని ఈ దాడితో తప్పించుకోవాలని చేసిన ప్రయత్నం సైతం విఫలం అయ్యింది. తీవ్ర గాయాలతో నడిరోడ్డుపైనే ప్రాణాలు వదిలారు విలేకరి జగన్మోహన్ రెడ్డి. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డిని చంపింది ఇద్దరు వ్యక్తులు అని..వాళ్లు రౌడీషీటర్లు అంటున్నారు పోలీసులు. బెంగళూరులో ఉంటున్న ఈరౌడీషీటర్లు.. హత్య కోసమే వి.కోటకు వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. హత్యకు కారణాలు ఏంటీ అనేది విచారణ తర్వాత వెల్లడిస్తామన్నారు పోలీసులు.

చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఏబీఎన్
విలేకరి జగన్మోహన్ హత్యను తీవ్రంగా ఖండించాయి జర్నలిస్టు సంఘాలు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటు అని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe