సర్పంచ్ ని సస్పెండ్ చేసిన కలెక్టర్ తన విధులను విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా పనులు..

BB6 TELUGU NEWS CHANNEL
ఆదిలాబాద్: రైతులకు అనధికారికంగా పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇచ్చోడ మండలం దాభా (బి) గ్రామ పంచాయతీ సర్పంచ్ నారవతే ఈశ్వర్‌ను పదవి నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

రైతులకు అనధికారికంగా పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇచ్చోడ మండలం దాభా (బి) గ్రామ పంచాయతీ సర్పంచ్ నారవతే ఈశ్వర్‌ను పదవి నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
      ఇచ్చోడ మండలంలోని దాభా (బి) సర్పంచ్ తన విధులను విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు విక్రయిస్తుండగా, టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసి 34 బస్తాల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు కావడంతో పాటు, జిల్లా వ్యవసాయ అధికారి నివేదిక మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం జిల్లా కలెక్టర్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
      సర్పంచ్ సమర్పించిన సంజాయిషీ అసంతృప్తికరంగా ఉండటంతో, ఆయనను సర్పంచ్ పదవిలో కొనసాగకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe