ఓటు హక్కు పరిరక్షణ BLA ల బాధ్యత – MLA బుయ్యని మనోహర్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఆధ్వర్యంలో తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ BLAలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీఎంఆర్ పాల్గొని, SIRపై BLA లకు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

BLA లు కీలకపాత్ర పోషిస్తున్నారు, మిగతా 10రోజులు కూడా మీ పాత్ర కీలకంగా ఉండాలి.

ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు. అర్హత ఉన్న ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి BLA అప్రమత్తంగా పనిచేయాలి.

ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయించాలన్నారు.

ప్రతి బూత్, ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో కీలకమని, ఈ బాధ్యతను ప్రతి కార్యకర్త నిబద్ధతతో నిర్వర్తించాలని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో TPCC SIR పర్యవేక్షకులు కోటం వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ SIR కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, BLAలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe