BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్న వెంకటయ్య వద్ద రెండు గేదేలు రెండు ఎద్దులు, బర్రె దూడలు ఉన్నాయి. పొలం లో పని ముయించుకొని, పశువులను వాటివాటి స్థానాల్లో పాకలో కట్టివేసి ఇంటికి వెళ్ళాడు. అదే రోజు రాత్రి సమయంలో చిరుత పులి పక్కనే ఉన్న బొందే గట్టు అడవి ప్రాంతం నుంచి వచ్చి బర్రె దూడను చంపేసింది, సగభాగం పూర్తి మొత్తంలో తిన్నది. రైతు వెంకయ్య ఆవేదనతో తన బాధను వ్యక్తం చేశాడు. ఇంతకు ముందు చాలా చోట్ల ఈ సంఘటనలు జరిగాయి. కానీ అడవి శాఖ ఆఫీసర్స్ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని కొండాపూర్, మన్సూర్పల్లి, షెక్పల్లి,గ్రామ ప్రజలు,అటవి విశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మార్చి నుంచి చిరుత పులులు దూడలు, మేకలపై దాడులు జరుగుతున్నా అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు.
గండిడ్ మండల కేంద్రంలో అటవీ శాఖ నిర్లక్ష్యం. బర్రె దూడను చంపితిన్న చిరుతపులి. భయాందోళనలో గ్రామస్తులు.
23
Jul