గోల్కొండ జగదాంబికా బోనాలు ప్రారంభం: బోనాలు ఎక్కడెక్కడ ఏ రోజు అంటే.?

BB6 TELUGU NEWS CHANNEL
ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణ నేలపై బోనాల సంబురాలు మొదలవుతాయి. నెత్తిన బోనం కుండలతో, ఘటాలతో…. పోతురాజుల విన్యాసాలతో, ఫలహారపు బళ్లతో భాగ్యనగర వీధులన్నీ కళకళలాడుతాయి. తల్లీ బైలెల్లినాదో… చల్లంగ మమ్మేలు మాయమ్మో… అంటూ జానపదుల పాటలు హుషారెత్తిస్తాయి. వర్షకాలంలో వచ్చే మహమ్మారుల నుంచి కాపాడమని జగన్మాతకు బోనాలు సమర్పిస్తారు. పంటలు వృద్ధి చెందాలని, ప్రతి ఇల్లు పిల్లాపాపలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రతి ఆదివారం బోనాల పండుగ చూసేవారికి చూడవేడుకగా సాగుతుంది.

భాగ్యనగరంగా ఖ్యాతి గాంచిన హైదరాబాద్ మహానగరంలో బోనాల వేడుక అపురూపంగా కొనసాగుతుంది. జంట నగరాలలో బోనాల వేడుక అతిపెద్ద ఉత్సవం. మొదటగా గోల్కొండ జగదంబికా అమ్మవారి ఆలయంలో బోనాల సందడికి శ్రీకారం చుడతారు. ఈ ఆషాఢ మాసంలో గురువారాల్లో ఆదివారాల్లో గోల్కొండ ఖిల్లా వద్ద జాతర నిర్వహిస్తారు. ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, లాల్ దర్వాజా సింహవాహిని మాతా మహేశ్వరి ఆలయంలో, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాల్లో ఈ ఆషాఢంలో బోనాల జాతర కనుల పండుగగా ఉంటుంది.

2026 ఆషాఢ బోనాలు జూలై 16న గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతర ఆగస్టు 9 వరకు రెండు పట్టణాలు సికింద్రాబాద్ లోని వివిధ అమ్మవారి ఆలయాల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.

ముఖ్యమైన తేదీల వివరాలు: జూలై 19, 2026 (ఆదివారం): గోల్కొండ కోట బోనాలు (ప్రధాన వేడుకలు)
జూలై 26, 2026 (ఆదివారం): బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం, బోనాలుఆగస్టు 2, 2026 (ఆదివారం): సికింద్రాబాద్ లష్కర్ బోనాలు (ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి)
ఆగస్టు 9, 2026 (ఆదివారం): లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు మరియు పాతబస్తీ బోనాలు.
ఆగస్టు 10, 2026 (సోమవారం): రంగం (భవిష్యవాణి) కార్యక్రమం, ఉత్సవాల ముగింపు మరియు తెలంగాణ ప్రభుత్వం నుండి అధికారిక సెలవుదినంబోనాల విశిష్టత:అమ్మవారికి భక్తులు నైవేద్యంగా వండిన అన్నం, బెల్లం, పెరుగు, పాలను మట్టి లేదా ఇత్తడి పాత్రలో (బోనం) తలపై పెట్టుకుని, డప్పు వాయిద్యాలతో ఆలయాలకు వెళ్లి సమర్పిస్తారు. ఈ పండుగలో భాగంగా పురుషులు పోతురాజులుగా వేషధారణ చేసి నృత్యాలు చేస్తారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe