అనసూయపై కామెంట్స్.జర్నలిస్టులు సహా 72 మందిపై కేసు.

సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు నటి అనసూయ ఫిర్యాదు

BB6 TELUGU NEWS CHANNEL
Anasuya: టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు, తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు,మార్ఫింగ్ ఫోటోలు అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా ఆమె చట్టపరమైన పోరాటానికి దిగారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ అనసూయ ఏకంగా 42 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఆన్‌లైన్ వేధింపులు పెరుగుతున్నాయని నటి అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 23 నుంచి సోషల్ మీడియా వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు చేయడమే కాకుండా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనసూయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 42 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్‌బాషా, రజని తదితరులపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe