Breaking News :సంగారెడ్డి: వట్‌పల్లి పీఎస్‌పై దరఖాస్తుపల్లి గ్రామస్తుల దాడి.

BB6 TELUGU NEWS CHANNEL
పీఎస్‌లోని అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన గ్రామస్థులు.
చెట్టుకు ఉరి వేసుకుని బీరప్ప (22) అనుమానాస్పద స్థితిలో మృతి.
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందికి దించిన వట్‌పల్లి పోలీసులు.
చెట్టుపై నుంచి మృతదేహాన్ని ఎలా కిందకు దించుతారని పోలీసులపై మృతుడి కుటుంబ సభ్యుల ఆగ్రహం.

పూర్తి వివరాలు : సంగారెడ్డి జిల్లా వట్ పల్లిపోలీస్ స్టేషన్ (Vatpally PS) పరిధిలో ఓయువకుడి అనుమానాస్పద మృతి ఘటనస్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు, ప్రజల ఆగ్రహానికి దారితీసింది. వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దాబాలో పని చేస్తున్న దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప (22) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే, యువకుడి మృతికి సంబంధించి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పోలీసులు మృతదేహాన్ని చెట్టుపై నుండి కిందకుదించడం వివాదానికి కారణమైంది.
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా, వారి సమక్షంలో కాకుండా మృతదేహాన్ని చెట్టు
పైనుంచి ఎలా కిందకు దించుతారంటూ దరఖాస్తుపల్లి గ్రామస్తులు, మృతుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, దాబానిర్వాహకుల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున వట్పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. స్టేషన్ లోని ఫర్నీచర్, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe