BB6 TELUGU NEWS CHANNEL
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మహిళా, శిశు,దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖపరిధిలోని 3 ఐసీడీఎస్ అల్వాల్, మేడ్చల్,కుత్బుల్లాపూర్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 62అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి.రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా మొత్తం 15,982 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుండగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మేడ్చల్ జిల్లా పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 13 జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల చేయగా మిగతా జిల్లాల్లో ఇదే తరహాలో వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.
మేడ్చల్ జిల్లాతో పాటు యాద్రాద్రి, కొత్తగూడెం జిల్లా పరిధిలోని అంగన్వాడి జిల్లాల్లో దరఖాస్తులు కోనసాగుతున్నాయి. ఇంకా దరఖాస్తు చేసుకొని వారు చివరి తేదీలోగా అప్లై చేసుకోవాలి.మేడ్చల్ మల్కాజ్గిరి 3 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల ఖాళీల వివరాలు: ప్రాజెక్టుల వారీగా ఖాళీలు అల్వాల్: 18 మేడ్చల్: 20
కుత్బుల్లాపూర్: 24
మొత్తం పోస్టుల సంఖ్య: 62 అంగన్వాడీ హెల్పర్ (Anganwadi Helper) పోస్టుకు సంబంధించి, ఇంటర్మీడియట్ / 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరూ అందుబాటులో లేనట్లయితే, తదుపరి పదోతరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.వయోపరిమితి: ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానకత కలిగిన మహిళా అభ్యర్థులు, దివ్యాంగులు వినికిడి పరికారాలు వినియోగించి వినగలిగే, అంధత్వం గల ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించే సామర్థ్యం,అంగవైకల్యంగల ప్రాథమిక విద్యాబోధన, పిల్లలను సంరక్షించగల మహిళా అభ్యర్థులు అర్హులు.
ఎంపిక విధానం: అంగన్వాడీ టీచర్, అంగన్వాడీహెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థితప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి.
పట్టణ ప్రాంతాల్లో అయితే సంబంధిత వార్డులోనూ,గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలోనూ నివసిస్తూఉండాలి. గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు,ఆవాసాల్లో పోస్టులకు సంబంధిత ఆవాస ఎస్టీ మహిళలు అర్హులు.
ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు అర్హులు.
ఎంపిక ప్రక్రియ: అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)..అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించింది.ఎంపికలో మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలకు పది మార్కులు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 05.08.2026.
Online link : https://mis.tgwdcw.in/
ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన ధ్రువపత్రాలు:పుట్టిన తేదీ/ వయసు ధ్రువీకరణ పత్రం
*కుల ధ్రువీకరణ పత్రం
విద్యార్హత ధ్రువీకరణ పత్రం (ఇంటర్/ ఆపైవిద్యార్హత మార్కుల జాబితా)
నివాస ధ్రువీకరణ పత్రం,అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికేట్
వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ
పత్రం:
ఆనధ అయితే అనాధ ధ్రువీకరణ పత్రం.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అంగన్వాడిల్లో 62 టీచర్ పోస్టులు
01
Aug