BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గండిడ్ నందు మండల అధ్యక్షులు వి జనార్ధన్ గారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ మదన్మోహన్ యాదవ్ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేస్తూ CPS రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలియజేశారు. పాత కార్యవర్గాన్నీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి నివేదిక సమర్పణని ఆమోదించడం ద్వారా రద్దు చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల అధికారి దివాకర్ మరియు పరిశీలకులు తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షులుగా V జనార్ధన్ గారు, ప్రధాన కార్యదర్శిగా A శ్రీనివాస్ రెడ్డిని అసోసియేట్ అధ్యక్షులుగా M కొండయ్య, కే స్వాతి వైస్ ప్రెసిడెంట్ గా P అశోక్ బాబు, బి కురుమయ్య, R అమిత, ప్రణిత సెక్రటరీలుగా ప్రశాంత్ కుమార్, M కృష్ణ, సావిత్రి, సంగీతను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహమ్మదాబాద్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, భీమ్ రెడ్డి, హన్వాడ అధ్యక్షులు స్వామి మరియు గండీడ్ మండలంలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
