యూరియా కొరకు కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో ధర్నా. పరిగి పరిరక్షణ సమితి మరియు రైతులు ఆందోళనల

స్థానిక ఎస్సై జోక్యం  చేసుకొని వ్యవసాయ అధికారులతో మాట్లాడి అదనంగా యూరియా లారీ వచ్చే విధంగా  హామీ ఇవ్వడంతొ నిరసన విరమింప చేసిన రైతులు

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల  మండల కేంద్రంలో యూరియా కోసం పరిగి పరిరక్షణ సమితి పి ఎన్ పి ఎస్ మరియు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఘనాపూర్ రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ గంటల తరబడి లైన్లో నిలబడ్డ యూరియా దొరకడం లేదని..కుల్కచర్ల  ప్రధాన కూడలి వద్ద యూరియా కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరైన సమయంలో పంటకు యూరియా అందకపోతే దిగుబడి రాదని.. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్సై రమేష్ పోలీసులు జోక్యం చేసుకొని రైతుల ఆందోళనను సర్దుమనిగించే ప్రయత్నం చేయగా.. ఓ రైతు ఎస్ఐ కాళ్లపై పడి యూరియా ఇప్పించాలని కన్నీరు పెట్టుకున్నాడు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గాదె మైపాల్ జట్టిగాళ్ల వెంకటయ్య బీఎస్పీ నాయకులు వెంకట్ శ్రీశైలం భాస్కర్ నరసింహులు శ్రీనివాస్ తదితర రైతులు పాల్గొన్నారు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe