BB6 TELUGU NEWS CHANNEL Tandur Vikarabad జిల్లా
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మహిళా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారోత్సవాలలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిర మహిళా శక్తి రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీతో పాటు ఇందిరమ్మ చీరలు పంపీణీ చేసిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
2025-26 ఆర్థిక సంవత్సరంకు గాను బ్యాంక్ లింకేజు ద్వారా 212 సంఘాలకు రూ.28.19 కోట్లు.
• వడ్డీలేని రుణాలు 1001 సంఘాలకు రూ. 1,61,64,759(ఒక్క కోటి అరవై ఒక్క లక్ష, అరవై నాలుగు వేయిల, ఏడువందల యాభై తొమ్మిది)
•స్ర్తీ-నిధి ద్వార 332 సంఘాలకు రూ.6.67 కోట్ల రుణం మంజూరు.
• పట్టణంలో విధీ వ్యాపారులకు (దాదాపు 5000మందికీ) గాను దాదాపు రూ.8 కోట్ల రుణం మంజూరు.
•పట్టణంలో 18,600 మహిళాలకు ఇందీరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
మహిళ సంఘాల బలోపేతానికి గౌరవ ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు.
గతంలో ఎన్నడు లేని విధంగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం.
ముఖ్యమంత్రి తాండూర్ నియోజకవర్గంకు 4 ఆర్టీసీ బస్సులు కేటాయించడం జరిగింది.
మహిళా సంఘాలకు ఆదాయ వనరులు చేకూర్చాలని ఉద్దేశ్యంతో వడ్ల కొనుగోలు కేంద్రాలు, చిరు వ్యాపారాలు, స్కూల్ యూనిఫామ్స్ తయారీ, మహిళా శక్తి క్యాంటీన్స్, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్య సంస్థలలో మౌలిక సదుపాయల కల్పన మహిళ సంఘాలకు అప్పగించడం జరిగింది.
అదే విధంగా తాండూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మహిళా సమైక్య భవనలు (SHG) మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
ప్రజా పాలనలో స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు వడ్డీ రహిత రుణాలు, ఉపాధి అవకాశాలు, వంటి కార్యక్రమాల ద్వారా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది.
నూతనంగా మంజూరైన మహిళా సమైక్య భవనాల పనులు త్వరలో ప్రారంభిస్తాం.
