BB6 TELUGU NEWS CHANNEL
తాండూర్ నియోజకవర్గం INTUC అధ్యక్షులు న్యాయవాది జిలాని ఆధ్వర్యంలో ముస్లిం పవిత్ర మాసమైన రంజాన్ నెలను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారని ఎంతో సహనంతో ఓర్పుతో ఒక నెలపాటు ఉపవాసాలు ఉండి దైవ మార్గంలో సంవత్సరం మొత్తం ఉండాలని ఆహారం తీసుకోకుండా అల్లాను ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారని అన్నారు. ఇలాంటి ఇఫ్తార్ విందులో గంగా జమున తైజీబ్ కుల మతాలకతీతంగా అందరూ కూడా పాల్గొంటున్నారని ఇదే మన దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వం అని అన్నారు. ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్న నాయకులు మోయిస్ బేగ్ రహమతుల్లా, సాయప్ప, ఇనాయత్ పాషా, వాజిద్ మియా, సంజయ్ గౌడ్, సోయెబ్, మోయిస్, ఖురేషి ,నాసర్ ఖాన్, యూసుఫ్, మోల్సబ్,యాసర్ బాబాసాహెబ్ మైనార్టీ టౌన్ సెక్రెటరీ అమీనా బేగం, ప్రెసిడెంట్ రిజ్వానా, కమల ,మహబూబ్ ,యాసిన్ ఖాన్, పాల్గొన్నారు
తాండూర్ నియోజకవర్గం INTUC అధ్యక్షులు న్యాయవాది జిలాని ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
20
Mar