పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం – MLA BMR

BB6 TELUGU NEWS CHANNEL తాండూరు మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక ఏకగ్రీవం, హాజరైన ఎమ్మెల్యే బీఎంఆర్ ..

తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కో-ఆప్షన్ ఎన్నికల్లో నాలుగు కో-ఆప్షన్ మెంబర్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు ఇతర కౌన్సిలర్లు ఏకాభిప్రాయంగా ఎన్నుకున్నారు.

అనంతరం కో-ఆప్షన్ సభ్యులకు సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బీఎంఆర్.

ఎన్నికైనవారు..
1.మేన్గారి సుభాష్ (15వ వార్డు)
2.మహమ్మద్ రహీం (10వ వార్డు)
3.చినోళ్ల సరిత హరి గౌడ్ (13వ వార్డు)
4.ఆప్రిన్ జవేరియా అన్వర్ అమ్మద్ ఖాన్ (17వ వార్డు)

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారిని కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

భవిష్యత్తులో మిగత వారికి సమయానుకూలంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు ఉన్నారు.