BB6 TELUGU NEWS CHANNEL
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ఈరోజు(బుధవారం) ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్ ఆయిల్ రేట్స్, ఇంధన సంరక్షణ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసెస్, బంగారం కొనుగోళ్ల వాయిదాపై చర్చించినట్లు సమాచారం. అలాగే, ఖరీఫ్ సీజన్ మద్దతు ధరల నుంచి కోల్ గ్యాసిఫికేషన్, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయ ఆధునికీకరణ వరకు భారీ కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఖరీఫ్ మద్దతు ధరలకు రూ.2.60 లక్షల కోట్లు..
దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల (MSP) అమలుకు కేంద్ర కేబినెట్ రూ.2,60,000 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యవసాయ రంగానికి ఆర్థిక భరోసా లభించనుంది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. వరికి మద్దతు ధర పెంపు
13
May