పిల్లలకు పాఠశాలల్లో నే ఉచితంగా మధుమేహ పరీక్షలు, చికిత్స

BB6 TELUGU NEWS CHANNEL
పిల్లల్లో మధుమేహానికి సంబంధించి పరీక్షలు, రోగ నిర్ధారణ, చికిత్స, దీర్ఘకాల నిర్వహణ విధానాలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం మార్గదర్శక పత్రాన్ని విడుదల చేసింది.
పిల్లల్లో మధుమేహానికి సంబంధించి పరీక్షలు, రోగ నిర్ధారణ, చికిత్స, దీర్ఘకాల నిర్వహణ విధానాలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం మార్గదర్శక పత్రాన్ని విడుదల చేసింది. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి జరిగిన ఓ జాతీయ సదస్సులో ‘పిల్లల్లో చక్కెర వ్యాధిపై మార్గదర్శక పత్రం’ను విడుదల చేశారు. పుట్టిన పిల్లల నుంచి నుంచి 18 ఏళ్ల వయసు లోపు వారిలో మధుమేహాన్ని ముందుగానే గుర్తించేందుకు కమ్యూనిటీ, స్కూల్‌ ఆధారిత వేదికల ద్వారా దేశవ్యాప్తంగా సార్వత్రిక స్ర్కీనింగ్‌ను నిర్వహించడమే ఈ ఫ్రేమ్‌వర్క్‌ లక్ష్యమని ఆరోగ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అనుమానిత కేసులకు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత నిర్ధారణ, చికిత్సలో కోసం జిల్లా స్థాయి ఆరోగ్య కేంద్రాలకు పంపనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో స్ర్కీనింగ్‌ నుంచి రోగ నిర్ధారణ సేవలు, జీవితకాల ఇన్సులిన్‌ చికిత్స, గ్లూకోమీటర్లు, టెస్టు స్ట్రిప్‌లు, ఆ తర్వాత క్రమం తప్పని ఆరోగ్య సంరక్షణను ఉచితంగా అందించడం ఈ కార్యక్రమంలో ఓ కీలకమైన విషయమని వెల్లడించింది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe