BB6 TELUGU NEWS CHANNEL
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈదురుగాలుల కారణంగా కల్లాల సమీపంలోని గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో నలుగురు రైతులు మృతి చెందగా, మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు.
మృతులను నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేష్, తనుగుల అభిరామ్‌తో పాటు మరో రైతుగా గుర్తించారు. సీదుల హరీష్ అనే రైతుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాద సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
లక్షేట్టిపేటలో విషాదం.. గోడ కూలి నలుగురు రైతులు మృతి
06
May