తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 11 మంది వైస్ ఛైర్మన్లు

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 11 మంది వైస్ ఛైర్మన్లు


తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు.. ఆ పార్టీ భారీ శుభవార్త తెలిపింది. నామినేటెడ్ పోస్టుల భర్తీని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను ప్రకటించింది. అదే సమయంలో 11 మంది వైస్ ఛైర్మన్లను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా.. తాజాగా మరింత మందికి అవకాశం కల్పించింది. అయితే మిగిలిన పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

తెలంగాణలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లను.. 11 మంది వైస్ ఛైర్మన్లను నియమిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసిన వారి పేర్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 11 కార్పొరేషన్లకు వైస్ ఛైర్మన్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని విడతలుగా రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయగా.. తాజాగా మరిన్ని పోస్టులకు పలువురు నేతలను ఎంపిక చేశారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌ – బస్వరాజు శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ – పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్


కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – బండి రమేశ్, వైస్ ఛైర్మన్ – పరుచూరి మురళి

Related News


వాల్మీకి బోయ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – గట్టు తిమ్మప్ప, వైస్ ఛైర్మన్ – బోయ నగేష్


యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – రఘునాథ్‌ యాదవ్‌, వైస్ ఛైర్మన్ – గజ్జి భాస్కర్ యాదవ్


వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ – గుంజా రేణుక, వైస్ ఛైర్మన్ – బత్తుల వెంకటేష్


హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – దూడెం వెంకట రమణ , వైస్ ఛైర్ పర్సన్ – జక్కని అనిత


లైవ్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఛైర్మన్‌ – చరణ్‌ కౌశిక్‌


తెలుగు అకాడమీ ఛైర్మన్‌ – ప్రొఫెసర్‌ వెంకట రమణ


వాషర్‌మెన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – డాక్టర్ అజయ్ కుమార్, వైస్ ఛైర్మన్ – బంగారు బాబు


గీత కార్మిక కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – చంద్రశేఖర్ గౌడ్, వైస్ ఛైర్మన్ – కేసం నాగరాజు గౌడ్


పెరిక కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – గొంగరి వెంకటేశర్లు, వైస్ ఛైర్మన్ – బుడ్గం శ్రీనివాస్


మేర కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – సంగ వెంకట్ రాజం, వైస్ ఛైర్మన్ – ఎం. లక్ష్మీనారాయణ


మున్నూరు కాపు కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వైస్ ఛైర్మన్ – అల్లం భాస్కర్


పద్మశాలి కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – గూడూరి శ్రీనివాస్


వెలమ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – జువ్వాడి నర్సింగ్ రావు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe