వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో  విద్యార్థులకు సందేశం.. జిల్లా ఎస్పీ జానకి

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా  : విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి లక్ష్యసాధన కోసం అంకితభావంతో కృషి చేస్తే విజేతలుగా నిలుస్తారని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. డ్రీం ఫోర్స్ ఫౌండేషన్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో వాగ్దేవి జూనియర్ కళాశాలలో జరిగిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తాను బీటెక్ చదివిన తర్వాత మాత్రమే పెద్ద పెద్ద సంస్థల్ని సందర్శించే అవకాశం దొరికిందని ఇప్పుడు డ్రీం ఫోర్స్ ఫౌండేషన్ కలాం ల్యాబ్ కృషి కారణంగా తొమ్మిదో తరగతిలోని ప్రఖ్యాత డిఆర్డీఓ లాంటి సంస్థలను సందర్శించే అవకాశం లభించడం అదృష్టమన్నారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని మంచి విషయాలపై దృష్టిని సారించాలని ఎస్పి అన్నారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ప్రతిరోజు యోగా సాధన మరవద్దని విద్యార్థులకు సూచించారు. వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులతోపాటు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎస్పి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ కమిటీ అధ్యక్షులు జనార్ధన్ కోశాధికారి నర్సప్ప డ్రీం కోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు టి ఎన్ వెంకటేశ్వర్లు  టిఎన్ శ్రీధర్ సభ్యులు మల్లప్ప గుముడాల చక్రవర్తి గౌడ్ ఆంజనేయులు అనురాధ శ్రావణి శోభారాణి సురేఖ తదితరులు పాల్గొన్నారు. 12 రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణ శిబిరానికి తెలంగాణలోని ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట్ వికారాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు 110 మంది విద్యార్థులు శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe