BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కార్పేట్ గ్రామంలో శాస్త్రవేత్తలు శశిభూషణ్, అసిస్టెంట్ ప్రొ॥ చరణ్ తేజ్ వారిచే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని సల్కార్పేట్ రైతు వేదికలో నిర్వ హించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేయాలని మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలు ఐన సన్న రకాలైన ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటి 1638 వంటి రకాలను వేసుకోవాలని అలాగే దొడ్డు గింజ రకాలైన ఎంటియు 1010, కేఎన్ఎమ్ 118 వంటి రకాల ను వేసుకోవాలని చెప్పారు. వరి పంటలో రైతులు పాటించాల్సిన మెలకువలు, పెట్టుబడి తగ్గించి అధిక దిగుబడి పొందే అంశాల గురించి చెప్పారు. సేంద్రియ వ్యవసాయం జీవన ఎరువుల వాడకం మరియు చౌడు భూములు యాజమాన్య గురించి అలాగే రసాయన మందులు పిచికారి చేసుకొనుట, తీసుకోవాల్సిన జాగ్ర ´త్తల గురించి వివరించారు. పంటలలో చీడపీడల నివారణ ఎరువు ల సమతుల్య వినియోగం వాతావరణాల వ్యవసాయ పద్ధతులపై రైతులకు సూచనలు చేశారు. రైతుల అడిగిన పలు సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు ఇచ్చి ఆధునిక సాగు విధానాలను వివరించారు. ఏఓ మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే, దిగుబడులు పెరిగి ఆర్థికంగా లాభ పడతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలతో పాటు,
కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, వ్యవసాయశాఖ ఏఓ జి రాధమ్మ, గ్రామ సర్పంచులు ఏఈఓలు వరలక్ష్మి ,మౌనిక, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
