తెలంగాణ పోలీసులకు ఆరోగ్య భద్రత పథకంపై కీలక నిర్ణయం

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ పోలీసు శాఖ ఆరోగ్య భద్రత పథకంలో క్యాష్‌లెస్ వైద్య చికిత్స సౌకర్యాన్ని 2026 జూలై 1 నుంచి నిలిపివేస్తున్నట్లు సర్క్యులర్ జారీ


ఎంపానెల్ ఆసుపత్రుల్లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న క్యాష్‌లెస్ చికిత్స సేవలు జూలై 1 నుంచి అందుబాటులో ఉండవు.


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ద్వారా కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

Related News


కొత్త ఆరోగ్య పథకం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనంలో 1.5 శాతం చందా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


దీంతో ఆరోగ్య భద్రత పథకం కోసం నెలవారీ చందా వసూళ్లను జూన్ 2026 జీతం నుంచి నిలిపివేశారు.


ప్రస్తుతం ఆరోగ్య భద్రత పథకం ద్వారా ప్రతి నెల సుమారు 3,000 వైద్య బిల్లులు వస్తున్నాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.


ప్రస్తుత విధానంలో ప్రభుత్వం నుంచి ఇకపై వైద్య రీయింబర్స్‌మెంట్ అందే అవకాశం లేకపోవడంతో క్యాష్‌లెస్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.


2026 జూలై 1 నుంచి ఆరోగ్య భద్రత పథకం కింద అన్ని ఎంపానెల్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స పూర్తిగా నిలిచిపోనుంది