BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీ చేపట్టి చాలా ఏళ్లు అయింది. ఇప్పటికే చాలా మంది కండక్టర్లు రిటైర్డ్ అయ్యారు. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా నిర్వహించనుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఆర్టీసీ. ప్రభుత్వ అనుమతి లభించడంతో నోటిఫికేషన్ విడుదలకు ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. అయితే పదో తరగతి మార్కుల విషయంపై చిన్న గందరగోళం నెలకొన్నది. ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందు ఆర్టీసీ ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సి ఉంది. గతంలో కండక్టర్ పోస్టులను పదో తరగతి మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేసేవారని తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయనున్నారు కానీ.. ఆ తర్వాత విద్యాశాఖ జీపీఏ గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. మళ్లీ ఇటీవల మార్కుల విధానం అమల్లోకి వచ్చింది.
దీనివల్ల దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండింటినీ సమానంగా ఎలా అంచనా వేయాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడింగ్ పాయింట్లను మార్కుల శాతంలోకి ఎలా మార్చాలనే దానిపై క్లారిటీ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాసినట్టుగా సమాచారం. బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే.. అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. పదో తరగతి మార్కుల్లో ఈ రెండు విభిన్న విధానాల అభ్యర్థులకు న్యాయం జరిగేలా గ్రేడింగ్‌ను మార్కుల శాతంలోకి ఎలా మార్చాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రతి ఏటా ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు పలు రీజియన్లలో తాత్కాలికంగా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకున్నారు. ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన 1,500 పోస్టులను రీజియన్ల వారీగా, రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం భర్తీ చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమవుతోంది.
పదో తరగతి గ్రేడింగ్, మార్కుల లెక్కింపుపై ఎస్సెస్సీ బోర్డు నుంచి క్లారిటీ రాగానే ఆర్టీసీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఆర్టీసీలో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు తమ టెన్త్ మెమోలు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆదాయం సిద్ధం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
పదో తరగతి మార్కులతో తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు
09
Jul