మీసేవలో యూరియా బుకింగ్‌.. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుక్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. యాప్ లేకున్నా యూరియా బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది. పీపీబీ (పట్టా పాస్ బుక్) నంబర్‌తో మీసేవల బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. ఓటీపీ ధ్రువీకరణతో వెంటనే బుకింగ్ ఐడీ వస్తుందని పేర్కొంది. ఈ బుకింగ్ ఐడీ 48 గంటలపాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుందని తెలిపింది. ఎంపిక చేసిన డీలర్ వద్ద యూరియా కొనుగోలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. మీసేవ సేవా రుసుము కేవలం రూ.10గా నిర్ణయించినట్లు వివరించింది. యాప్ లేదా మీసేవ ద్వారానే అధికారిక బుకింగ్ ఉంటుందని స్పష్టం చేసింది. అందుకు యాక్టివ్ మొబైల్ నంబర్ తప్పనిసరి అని పేర్కొంది. ఏమైనా సందేహాల ఉంటే ఏఈవో (AEO), ఎమ్‌ఏఓ (MAO) లేదా మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూచించింది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe