రేపే రైతుల ఖాతాల్లోకి మరో ₹1,900 కోట్లు , 9 రోజుల్లోనే ₹9,000 కోట్ల ‘రైతు భరోసా’డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

•రైతు రాజ్యమే కాంగ్రెస్ లక్ష్యం
•9 రోజుల్లోనే ₹9,000 కోట్ల ‘రైతు భరోసా’
•ఖమ్మం వేదికగా ‘రైతు ఆశీర్వాద సభ’
•రేపే రైతుల ఖాతాల్లోకి మరో ₹1,900 కోట్లు
•వ్యవసాయాన్ని పండగ చేయడమే ప్రజా ప్రభుత్వ ఆశయం
•రైతు సంక్షేమమే ధ్యేయం: కేవలం 9 రోజుల్లోనే ₹9,000 కోట్లు విడుదల — డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. చింతకాని మండలం జగన్నాధపురం – మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద నిర్వహించనున్న “రైతు ఆశీర్వాద సభ” ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం లచ్చగూడెం రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే రైతాంగానికి పెట్టుబడి సాయం అందిస్తూ, వ్యవసాయాన్ని పండగ చేయడమే తమ ఆశయమని ఆయన ప్రకటించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం వద్ద రేపు నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ రాష్ట్ర రైతాంగానికి పండుగ వాతావరణాన్ని తీసుకురానుందని ఆయన తెలిపారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులు పాల్గొని రైతు భరోసా పథకం కింద చివరి విడతగా రూ.1,900 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు


గత పాలకుల తీరును ఎండగడుతూ భట్టి విక్రమార్క కీలక గణాంకాలను వెల్లడించారు. రైతు భరోసా పథకంపై మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.72 వేల కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లలోనే రూ.35,839 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేసిందన్నారు. ఇదే కాలంలో రైతు భరోసా, రుణమాఫీ, పంట బోనస్, పంటల బీమా, పంట నష్టపరిహారం, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ, సాగునీటి ప్రాజెక్టులు తదితర పథకాల ద్వారా రైతుల కోసం మొత్తం రూ.1,67,877 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన వివరించారు.

రైతు భరోసా కింద రికార్డు స్థాయిలో కేవలం 9 రోజుల్లోనే  రైతులకు ₹8,759 కోట్లు విడుదల చేశామని భట్టి విక్రమార్క తెలిపారు.
“రేపు (10వ తేదీన) జరగబోయే ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరుల సమక్షంలో.. నేరుగా రైతుల అకౌంట్లలోకి మరొక ₹1,900 కోట్ల రూపాయలను బదిలీ చేయనున్నట్లు చెప్పారు. దీనితో ఈ సీజన్‌కు గాను కేవలం తొమ్మిది రోజుల్లోనే సంపూర్ణంగా ₹9,000 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లవుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా వ్యవసాయానికి కేంద్రబిందువుగా నిలిచిందని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల ఆధారంగా ఈ ప్రాంత ప్రజల జీవనాధారం వ్యవసాయమేనని భట్టి పేర్కొన్నారు. రైతు కుటుంబాలు బలోపేతం కావాలంటే వ్యవసాయ రంగం బలోపేతం కావాల్సిందేనన్న స్పష్టమైన అవగాహనతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

రైతుల కోరిక మేరకే ఈ కార్యక్రమానికి ‘రైతు ఆశీర్వాద సభ’ అని పేరు పెట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెద్ద సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మీడియా ప్రతినిధులను కోరారు.

ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయానికి ప్రతీక అని, నాగార్జున సాగర్ ఎడమ కాల్వతో పాటు అనేక ప్రాజెక్టుల ద్వారా ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని భట్టి పేర్కొన్నారు. ఇక్కడి రైతుల కోరిక మేరకే ఈ కార్యక్రమానికి అధికారులు కాకుండా, రైతులు స్వయంగా “రైతు ఆశీర్వాద సభ” అని పేరు పెట్టుకున్నారని ఆయన వెల్లడించారు.

ఈ సభకు జిల్లా మరియు రాష్ట్రవ్యాప్త రైతాంగ సోదరులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అలాగే, సమాజంలో ప్రతి ఒక్కరి పునాదులు వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయని, మీడియా మిత్రులు కూడా తమ వంతు బాధ్యతగా ఈ రైతు పండగను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

Related News

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe