BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వరుణ యాగంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
వరుణ్యాగంలో ముఖ్యమంత్రి దంపతులు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలతో వరుణదేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు. ఈ పవిత్ర యాగంలో మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఒకే ఫ్రేమ్‌లో ముఖ్యమంత్రి మరియు ఉత్తంకుమార్ రెడ్డి దంపతులు
దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి గారు ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ఈ వరుణ యాగం నిర్వహించామని తెలిపారు.
✅ భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తూనే వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహించాలని వేడుకున్నారు.
✅ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది.
✅ “రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ లతో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళతో కళకళలాడాలి. భూగర్భ జలాలు పెరగాలి. పంటలు పుష్కలంగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి” అని ముఖ్యమంత్రి వరుణ దేవుడిని ప్రార్థించారు.
✅ ఈ పవిత్ర వరుణయాగ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు శ్రీ కె.కేశవ రావు, శ్రీ పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ కె. జానారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలైంది. కొందరు అధికారుల పనితీరు మారడం లేదని DGP C.V. ఆనంద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రగతి రివ్యూ ...
BB6 TELUGU NEWS CHANNEL శ్రీశైల మహాక్షేత్రంలో వరుణుడి కరుణ కోసం నిర్వహిస్తున్న మహా వరుణ యాగం నాలుగో రోజు కూడా అత్యంత వైభవంగా కొనసాగింది. లోక కల్యాణం కోసం, సకా...
BB6 TELUGU NEWS CHANNEL ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెలలో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జులై 25 నుంచి ఆగస్టు 10 వర...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు షాక్ ఇచ్చింది. ...
Telangana School Bonalu Holiday 2026 Latest News : విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో పాఠశాలలకు విద్యార్థులకు ఈనెల 10 నా బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వోని వెన్నచెడ్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గుర్రాల న...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన టీచర్ స్థానంలో డూప్లికేట్ టీచర్ విధులు ...
BB6 TELUGU NEWS CHANNEL పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ ...