బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య — రాజ్‌బరీ జిల్లాలో ఉద్రిక్తత

BB6 TELUGU NEWS CHANNEL
ఢాకా: బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలు మరోసారి హింసకు దారితీశాయి. రాజ్‌బరీ జిల్లాలోని హొసేన్‌డంగా ఓల్డ్ మార్కెట్‌ వద్ద జరిగిన దాడిలో సామ్రాట్‌ అనే హిందూ యువకుడు మరణించాడు. అల్లరి మూక అతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సూచన అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతకు అదనపు బలగాలను మొహరించినట్లు స్థానిక సమాచారం.

Bangladesh:బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. దీపూ చంద్రదాస్‌ను హత్య ఉదంతాన్ని మరవకముందే మరో హిందూ యువకుడిని ఓ మూక దారుణంగా కొట్టి చంపింది. బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపూ చంద్రదాస్‌ను చంపి చెట్టుకు ఉరివేసి దహనం చేసిన ఘటన మరవకముందే మరో దారుణ ఘటన జరిగింది. రాజ్‌బరీ జిల్లాలో 29ఏళ్ల అమృత్‌ మండల్‌ అలియాస్‌ సామ్రాట్‌ అనే మరో హిందూ యువకుడిని ఓ మూక కొట్టి చంపింది.
బుధవారం రాత్రి 11 గంటలకు హొసేన్‌డంగా ఓల్డ్‌ మార్కెట్‌ ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు బంగ్లాదేశ్‌ పోలీసులు తెలిపారు. ఐతే అతడు దోపిడీకి పాల్పడటం వల్లే స్థానికులు ఆగ్రహంతో దాడి చేశామని చెప్పారని పోలీసులు వెల్లడించారు. అమృత్‌ మండల్‌ స్థానికంగా ఓ సామ్రాట్‌ బాహిని అనే గ్రూప్‌ లీడర్‌ అని తమకు సమాచారం ఉందన్నారు. విచారణ కొనసాగుతోందని, నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు.