BB6 TELUGU NEWS CHANNEL
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ పోలీసులకు చిక్కాడంటూ జరుగుతున్న ప్రచారంపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షాబాద్ ఆరు హత్యల కేసులో దర్యాప్తును వేగవంతం చేశాము. నిందితుడి కోసం మొత్తం తొమ్మిది బృందాలతో గాలిస్తున్నాం. నిందితుడు చేగురు రైల్వే ట్రాక్ దాటి అడవి ప్రాంతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నాం. రాజ్‌కుమార్ తన మొబైల్ ఫోన్‌ను శుక్రవారం రాత్రి 11:47 స్విచ్ ఆఫ్ చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు. రాజ్‌కుమార్ కోసం రైల్వే పోలీస్, ట్రాకింగ్ టీమ్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ టీమ్స్‌తో 9 బృందాలు గాలిస్తున్నాయి. రాజ్ కుమార్ పోలీసులకు చిక్కినట్టు మీడియాలో వస్తున్న విషయం వాస్తవం కాదని స్పష్టం చేశారు.
