యువశక్తి బడ్జెట్‌’గా కేంద్ర బడ్జెట్‌ – నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు 2026

BB6 TELUGU NEWS CHANNEL
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని పేర్కొంటూ, దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోందన్నారు.
నిర్మలా సీతారామన్ ప్రధాన వ్యాఖ్యలు:
దేశం 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని వెల్లడించారు.వికసిత్ భారత్ దిశగా కీలక అడుగులు వేస్తున్నామన్నారు
గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉందని పేర్కొన్నారు
ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా పలు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు.ఈ బడ్జెట్‌ను **‘యువశక్తి బడ్జెట్‌’**గా అభివర్ణించారు. మూడు కర్తవ్యాలు – కేంద్ర లక్ష్యాలు: సమ్మిళిత ఆర్థిక వృద్ధి వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’తో సంస్కరణల అభివృద్ధి మంత్రం అదనంగా, దేశంలో ఫిస్కల్ డిసిప్లిన్ సాధించామని, జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.93 లక్షల కోట్లు నమోదయ్యాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో నిలకడ వచ్చిందని, ద్రవ్యోల్బణం మితమైన స్థాయిలో ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఉపాధి కల్పనకు సమగ్ర సంస్కరణలను తీసుకొచ్చాం.. నేషనల్‌ సెమీకండక్టర్‌ మిషన్‌ను ఏర్పాటు చేశాం.. సెమీ కండక్టర్‌ మిషన్‌ 2.0 కోసం రూ. 40 వేల కోట్లు కేటాయింపు.. ఖాదీ రంగం కోసం మహాత్మాగాంధీ స్వరాజ్‌ స్కీమ్‌.. ఫార్మా రంగానికి రూ. 10 వేల కోట్లు.. టెక్స్టైల్‌ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం.. మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుల ఏర్పాటు.. దేశంలో కొత్తగా మూడు NIPERల ఏర్పాటు.. ప్రస్తుతం ఉన్న NIPERల ఆధునికీకరణకు చర్యలు: నిర్మలా సీతారామన్‌

ఆర్థిక సుస్థిరత కోసం ఆరు రంగాల్లో కీలక సంస్కరణలు.. రెండు హైటెక్‌ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు.. MSMEలకు క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌.. విలువైన ఖనిజాల తవ్వకాల కోసం కొత్త స్కీమ్‌.. కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో రేర్‌ ఎర్త్‌ కారిడార్‌.. SME గ్రోత్‌ ఫండ్‌కు రూ. 10 వేల కోట్లు.. కార్గో అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ.. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జలమార్గాలు.. ఒడిశాలో నేషనల్‌ వాటర్‌వే కారిడార్‌.. కొత్తగా కోస్టల్‌ కార్గో ప్రమోషన్‌ స్కీమ్‌: నిర్మలా సీతారామన్‌

నగరాలే దేశ గ్రోత్ ఇంజిన్లు.. రెండో, మూడో స్థాయి నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.. పాట్నా, వారణాసిల్లో షిప్‌ రిపేర్‌ ఎకోసిస్టమ్‌.. 7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల అభివృద్ధి.. ముంబై- పుణే, పుణే-హైదరాబాద్‌, హైదరాబాద్‌- చెన్నై రూట్లలో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు.. ఢిల్లీ- వారణాసి, వారణాసి- సిలిగురి మార్గాల్లో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌:  నిర్మలా సీతారామన్‌

21వ శతాబ్దం టెక్నాలజీదే.. ఏఐ మిషన్ కు ప్రాధాన్యం.. హై లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటు.. ఏఐతో విద్యార్థులు, రైతులకు ఉపయోగపడే ప్రణాళికలు: నిర్మలా సీతారామన్