నేడే రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. 3,911 పంచాయతీల్లో పోలింగ్

BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ నేడు (డిసెంబర్‌ 14) జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. ఈ విడతలో మొత్తం 3,911 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

పోలింగ్‌ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టారు.

ఇప్పటికే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 415 సర్పంచ్‌ స్థానాలు, 8,307 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన స్థానాలకు నేడు పోలింగ్‌ జరగనుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.