ఉప సర్పంచ్‌లకు షాక్.. చెక్ పవర్ రద్దుకు సర్కార్ నిర్ణయం

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దుకానుంది. ఇకఆ పవర్ సర్పంచ్,గ్రామ కార్యదర్శులకు చెక్ పవర్ రానుంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనుంది. ఉప సర్పంచ్‌లకు చెక్పవరస్థానంలో గ్రామకార్యదర్శికి అప్పగిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పాలనా వ్యవస్థలో ఓ ప్రజాప్రతినిధి, మరొకరు అధికారి జవాబుదారీగా ఉండాలని, అందుకోసమే పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేసి, సర్పంచ్, గ్రామకార్యదర్శి సంతకంతో చెక్ పాస్ అయ్యేలా చూడాలని సవరణలు తీసుకురానున్నారు. అయితే ఉపసర్పంచ్లకు చెక్ పవర్ ద్వారా ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నిధులు ఇంకా కావాలని కొన్నిశాఖలు అడుగుతుండగా, పంచాయతీరాజ్ శాఖలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందనే ఉద్దేశంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలిసింది. నిధులు ఖర్చు కావడంలో జాప్యంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చట్టసవరణకు సంబంధించిన నిర్ణయం.. త్వరలో జరిగే క్యాబినెట్ ముందుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. రాజకీయ నిర్ణయం దాదాపు జరిగిందని, ఇక అధికారిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని చెబుతున్నారు. ఒకసారి రాజకీయ నిర్ణయం జరిగాక కొంత సమయం తీసుకుంటుందని, అంతేతప్ప వెనక్కి పోవడం ఉండదని అధికారులు ధీమాగా ఉన్నారు.

చెక్పవర్ ఎందుకు ?

ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయాలనే ప్రతిపాదన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఆసమయంలో ఈ నిర్ణయంపై పెద్దఎత్తున దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి, మంత్రికి లేని చెక్ పవర్ కేవలం సర్పంచ్‌లకు మాత్రమే ఎందుకు అనే చర్చ నడిచింది. ఆ తర్వాత స్వరాష్ట్రం ఏర్పాటుతో బీఆర్ఎస్  ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. సర్పంచ్ తో పాటు ఉపసర్పంచు చెకవర్ ఇచ్చారు. గ్రామ కార్యదర్శిని పక్కకు పెట్టారు. దీంతో గ్రామాల్లో కొత్త సమస్యలు మొదలయ్యాయి. పాలనావ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. గత బీఆర్ఎస్ధాయాంలో అనేక మంది సర్పంచులు తమ గౌరవ వేతనాల చెక్లపై కూడా ఉపసర్పంచ్ ల సంతకాలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్పంచ్, ఉపసర్పంచ్ గా రాజకీయ వైరాలతో బిల్లులు పాస్ కావడం లేదని, చెక్కులపై సంతకాలు చేయడంలో జాప్యం చేస్తున్నారని, వారికి నచ్చచెప్పడం అధికారుల నుంచి కావడం లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఉపసర్పంచ్క చెప్పవరద్దు చేయాలని, ఇద్దరు ప్రజాప్రతినిధులకూ రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఈ నిర్ణయానికి ప్రభుత్వం సైతం ఓకే చెప్పడంతో త్వరలో నిధుల ఖర్చుకు సంబంధించి పరిష్కారం దొరుకుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe