BB6 TELUGU NEWS CHANNEL
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయాలను పురస్కరించుకుని, గండీడ్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు కె విజయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బిజెపి శ్రేణులు “విజయ దుందుభి” మోగించాయి. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ.. ఈ గెలుపు కేవలం మూడు రాష్ట్రాలదే కాదని, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంపై ప్రజలకున్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు. “నేడు బెంగాల్, అస్సాం.. రేపు తెలంగాణ” అనే నినాదంతో కార్యకర్తలు ఉత్సాహంగా కదం తొక్కారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి మల్కయ్య, మండలం ఉపాధ్యక్షులు భద్రేశ్వర్, ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు సంతోష్,కిషన్ మోర్చా మండల అధ్యక్షులు క్రిష్ట రెడ్డి,మాజీ ప్రధాన కార్యదర్శి నరహరి రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ వనపల్లి నవీన్, రాజ వర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్,బూత్ అధ్యక్షులు శివ,కృష్ణ,జానంపల్లి వార్డ్ మెంబర్ వంశీ, బిజెపి నాయకులు కేశవ్,నరసింహ,నరసింహ రెడ్డి, మండల స్థాయి వివిధ విభాగాల నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు మరియు మోదీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
