BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ ఎన్నికలు పూర్తవగా ఇప్పుడు మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
తాజాగా ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఓటర్ల జాబితా ప్రక్రియ ప్రారంభం :
2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు నవీకరించిన ఓటర్ల జాబితా ఆధారంగా ప్రక్రియ కొనసాగనుంది కొత్త ఓటర్లను గుర్తించి, పంచాయతీలు మరియు పోలింగ్ కేంద్రాల వారీగా విభజించాలని ఆదేశాలు డేటాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మార్గదర్శకాల ప్రకారం అనుసంధానం చేయాలి ఏవైనా లోపాలు ఉంటే ఈ నెల 23లోపు నివేదించాలి
ముసాయిదా జాబితా విడుదల తర్వాత అభ్యంతరాల స్వీకరణ, అనంతరం తుది జాబితా ప్రకటించనున్నారు.
📍 ఎక్కడ ఎన్నికలు జరగనున్నాయి?
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలను మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
⚖️ ఆలస్యానికి కారణం
గతంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసులు ఉండటంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి
తాజాగా న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కావడంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుంది.
📊 స్థానాల వివరాలు :
మొత్తం జడ్పీటీసీ స్థానాలు: 566
ఎంపీటీసీ స్థానాలు: 5,773
పట్టణీకరణ వల్ల ఈసారి:44 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి ,4 జడ్పీటీసీ స్థానాలు తగ్గాయి
జిల్లా పరిషత్‌ల సంఖ్య: 31
🏛️ రాజకీయంగా కీలకం
ఈ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి.
సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా బలంగా పోటీకి సిద్ధమవుతున్నాయి
👉 మొత్తం మీద, ఓటర్ల జాబితా ఖరారు అయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరగడం ఖాయం.
Breaking News : తెలంగాణ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్
18
Apr